‘‘సూపర్ 6’పై అబద్ధాలు ఎందుకు బాబు’ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. యువగళం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు పథకాల్లో ఒక్క పావు దీపం తప్ప, మిగతా ఐదు పథకాలు అమలు కాలేదన్నారు. సూపర్ సిక్స్‌లో 3 పథకాలు గ్రౌండ్ అయ్యాయని అసెంబ్లీలో అబద్ధాలు ఎలా చెబుతారని పశ్నించారు. ఐదు నెలల కూటమి పాలనలో ఆదాయం 8.7% తగ్గిందన్నారు.