హోళగుంద మండల కేంద్రం ఈబీసీ కాలనీ నందు నివాసముంటున్న నాలుగు సంవత్సరాల బాలుడి పై శనివారం పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే ప్రాథమిక వైద్య కేంద్రా నికి బాలుడిని తీసుకెళ్లగా వైద్య అధికారులు మెరుగైన చికిత్సకు ఆదోని ఆసుపత్రికి తరలించారు. కాలనీవాసులు పిచ్చి కుక్కను వెంబడించి కొట్టి చంపారు.