పి. కోటకొండలో నీటి కుంటలో పడి వృద్ధురాలు మృతి

27చూసినవారు
పి. కోటకొండలో నీటి కుంటలో పడి వృద్ధురాలు మృతి
దేవనకొండ మండలంలోని పి. కోటకొండ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. శనివారం 80 ఏళ్ల చెన్నమ్మ అనే వృద్ధురాలు, నెల్లిబండ గ్రామంలోని మనవరాలిని చూడటానికి రెండు రోజుల క్రితం నడకన బయలుదేరింది. ఈదులదేవరబండ వద్ద నీరు తాగేందుకు వెళ్లి నీటి కుంటలో పడి మృతి చెందింది. గ్రామస్తులు మృతదేహాన్ని బయటకు తీశారు. భర్త, కుమార్తె మరణంతో ఒంటరిగా ఉన్న ఈ వృద్ధురాలి విషాద మరణంతో గ్రామంలో విషాదాన్ని నెలకొంది.

సంబంధిత పోస్ట్