మరకట్టలో 140 సెక్షన్..

85చూసినవారు
మరకట్టలో 140 సెక్షన్..
మరకట్టలో అంబేద్కర్ జయంతి రోజున 140 సెక్షన్ విధించారు. గతంలో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన చిన్నపాటి గొడవలకు ఆదివారం సీఐ, విఆర్ఓ గ్రామాన్ని చేరుకొని ఎస్సీ కాలనీకి వెళ్లి అంబేద్కర్ జయంతి ఇక్కడ నిర్వహించకూడదని హెచ్చరించినట్లు కాలనీ యువకులు తెలిపారు. గ్రామంలో అంబేద్కర్ జయంతి యువకులు జరుపుకోవాలని ఉత్సాహంతో ఉన్నారని 140 సెక్షన్ విధించి యువకులకు వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని బీఎస్పీ తాలూకా ఇంచార్జ్ రామలింగయ్య పోలీసులపై మండిపడ్డారు. ఖచ్చితంగా అంబేద్కర్ జయంతి నిర్వహించి తీరుతామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్