విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వీర భద్ర గౌడ్ కలిశారు. ఆలూరు నియోజకవర్గం రాష్ట్రంలో వెనుకబడి ఉందని, అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని, పొలాలకు నీటి సరఫరా మెరుగుపరిచి ఆలూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సమస్యలను పరిశీలించి త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.