నల్లచెలిమలలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోరీ

82చూసినవారు
నల్లచెలిమలలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోరీ
దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామంలో ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం చోరీ జరిగింది. దుండగులు ఆలయంలోకి ప్రవేశించి హుండీ తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు తీసుకొని పారిపోయారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్