ఆలూరు మండలం అరికెర గ్రామంలో తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదురోజుల ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం ఘనంగా ముగిశాయి. శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో జరిగిన ఈ సభలో డాక్టర్ మల్లు వేంకటరెడ్డి దేశ రక్షణకు సంస్కృతి ప్రాధాన్యతను వివరించారు. రామాయణం, మహాభారతం ప్రవచనాలు, భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి.