దేవనకొండ మండలం కరివేముల గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు వెంబడి వెళ్తున్న మతిస్థిమితం లేని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి పారిపోయింది. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ రంగన్న క్షతగాత్రుడిని దేవనకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.