సిపిఐ యం. యల్ లిబరేషన్ పార్టీ ఆలూరు కార్యదర్శి మునుస్వామి ఆధ్వర్యoలో హాలహర్వి ఎంపీడీవో కార్యాలయం ముందు ఉపాధి వేతనాల కోసం మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఉపాధికూలీలు వేతనాలు పెండింగ్లో ఉండడం వలన ఆందోళన చెందుతు న్నారని తక్షణమే నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఉపాధికూలీల వేతనాలను అకౌంట్లో జమచేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఏపీఓ కి వినతిపత్రం ఇవ్వడంజరిగింది.