ఆలూరు: విస్తృత వర్షాలు.. పొంగిన వాగులు, వంకలు

69చూసినవారు
ఆలూరు: విస్తృత వర్షాలు.. పొంగిన వాగులు, వంకలు
ఆలూరు నియోజకవర్గంలో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. దాంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఖరీఫ్ సీజన్ ముందు రైతులు నాటిన పత్తి మొక్కలకు ఈ వర్షం జీవం పోసింది. దేవనకొండ మండలంలో అత్యధికంగా 69.4 మి. మీ వర్షపాతం నమోదు కాగా, చిప్పగిరి మండలంలో 18.04 మి.మీ అత్యల్ప వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రైతులు హర్షంతో ఉన్నారు.

సంబంధిత పోస్ట్