బనగానపల్లెలో 30 లీటర్ల నాటుసారా స్వాధీనం

77చూసినవారు
బనగానపల్లెలో 30 లీటర్ల నాటుసారా స్వాధీనం
బనగానపల్లె సెబ్ పోలీసు స్టేషన్ సీఐ జోగేంద్ర ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా విక్రయాలపై బుధవారం దాడులు నిర్వహించారు. పలుకూరు, చిన్నరాజుపాలెం తండా, ఇల్లూరు కొత్తపేట గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఇల్లూరుకొత్తపేటలో నల్లగండ్ల అశోక్ కుమార్ అనే వ్యక్తి వద్ద 30 లీటర్ల నాటుసారా సీజ్ చేసి, అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ జోగేంద్ర తెలిపారు. తనిఖీల్లో సెబ్ ఎస్సై పోతులయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్