ప్రమాదవశాత్తు మిద్దె పైనుంచి పడి వ్యక్తి మృతి

80చూసినవారు
ప్రమాదవశాత్తు మిద్దె పైనుంచి పడి వ్యక్తి మృతి
పెంపుడు పావురాలకు గింజలు పెట్టడానికి మిద్దెపైకి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఈ సంఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన దూదేకుల చిన్న కుళ్లాయప్ప (68) ఇంటి మేడపై ఉన్న పావురాలకు గింజలు, నీళ్లు పెట్టడానికి వెళ్లి కాలుజారి కిందపడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్