బనగానపల్లె పట్టణంలో యాగంటి పల్లి యనకండ్ల గ్రామ పరిధిలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు పంటలపై సస్యరక్షణ చేపట్టాల్సిన విషయమై అవగాహన కల్పించారు. పంటల బీమా పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సంవత్సరం రబి లో జొన్న పప్పు శనగపై రైతులు స్వచ్ఛందంగా ప్రీమియం చెల్లించి పంట బీమా చేసుకోవాలని కోరారు. బీమా ప్రీమియం చెల్లించుటకు చివరి తేదీ డిసెంబర్ 15 అని తెలియజేయడమైనది.