కొలిమిగుండ్లలో ప్రభుత్వ అధికారులను, ప్రజలను భయపెట్టే చెన్నప్ప అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. అన్సర్ బాషా అనే వ్యక్తికి సంబంధించి రూ. 2 లక్షలు తీసుకుని, ఇంకో రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అరెస్టు సమయంలో అతను పోలీసులపై దాడికి యత్నించాడని వెల్లడించారు. కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.