ప్రజల నుంచి వచ్చిన వినతులను చిత్తశుద్ధితో పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదివారం ఆదేశించారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది.