బనగానపల్లె మండల పరిధిలోని మిట్టపల్లె గ్రామ శివారులో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన నాగలక్ష్మ, సంకటి దస్తగిరి చెందిన పశువుల గడ్డివాము కాలిపోయింది. బనగానపల్లి అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరి మంటలను ఆర్పి వేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ యడమ కంటి తులసి రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు.