బనగానపల్లె అవుకు మండలం కోనాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు ఉమ్మడి చిన్న కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, అవుకు మండలం వైసీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి, నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి గంగమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.