బనగానపల్లె పట్టణంలోని ప్రార్థన మందిరాల్లోకి వచ్చే భక్తుల తాగునీటి సౌకర్యార్థం బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేశారు. ఆదివారం ఖాజీవాడ మసీదు, క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థన మందిరాల్లో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్స్ ను ఆయన ప్రారంభించారు. నాలుగు ప్రార్ధన మందిరాలలో మినరల్ వాటర్ ప్లాంట్స్ ను రూ. 6 లక్షల సొంత నిధులు ఖర్చు చేసి ఏర్పాటు చేసామన్నారు.