బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎస్సార్బీసీ కెనాల్‌లో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులను శుక్రవారం రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులను వేగంగా పూర్తి చేసి వెంటనే కెనాల్ మరమ్మత్తులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జల వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు పూర్తి చేయాలని సూచించారు.