బనగానపల్లె: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి

65చూసినవారు
బనగానపల్లె: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి
కొలిమిగుండ్ల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నాగయ్య (43) అనే వ్యక్తి శుక్రవారం గుండె పోటుతో మృతి చెందాడు. వేపరాలకు చెందిన నాగయ్య, తాడిపత్రి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు జమ్మలమడుగు డిపో బస్సులో ప్రయాణిస్తున్న ఆయన టికెట్ తీసుకున్న సమయంలో బాగానే ఉన్నాడు, చివరి సీటులో పడుకున్న తర్వాత గుండెపోటు రావడంతో కింద పడ్డాడు. ప్రయాణికులు గుర్తించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రైవేట్ వైద్యుడు మరణాన్ని నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్