బనగానపల్లె నియోజకవర్గం అవుకు మెట్టుపల్లె మధ్య రోడ్డు ప్రమాదంలో ముడావత్ రసూల్ నాయక్ మంగళవారం ఉదయం మృతి చెందాడు. టన్నెల్ పనికి వెళ్లే సమయంలో రామవరం నుండి వస్తున్న మొక్కజొన్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఘటన జరిగింది. రసూల్ నాయక్ అక్కడికక్కడే మృతిచెందగా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.