బనగానపల్లె మండలం పాతపాడు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం గ్రామానికి చెందిన వైయస్సార్సీపీ నాయకుడు కుమ్మరి రాము (35) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయాన్ని తెలుకొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వారి స్వగృహానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.