బనగానపల్లి: రేపు చౌడేశ్వరీ అమ్మవారికి పల్లకి సేవ

68చూసినవారు
బనగానపల్లి: రేపు చౌడేశ్వరీ అమ్మవారికి పల్లకి సేవ
బనగానపల్లె మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో వెలసిన అమ్మవారికి శుక్రవారం పల్లకి సేవా కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేషమైన అలంకరణ గావించి ప్రత్యేక పూజలు, తదుపరి అమ్మవారి పల్లకి ఉత్సవాన్ని ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తామని. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్