బనగానపల్లె పట్టణంలో బైపాస్ నిర్మాణానికి భూమి పూజ రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సోమవారం చేశారు. ఏడాదిన్నర కాలంలో రింగ్ రోడ్డు పనులను పూర్తి చేస్తామని అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్ అండ్ బి శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని అన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పూర్తి చేసి ఆర్ అండ్ బి శాఖకు పూర్వ వైభవం తీసుకొస్తాం అన్నారు.