భూసార పరీక్షలతో పంటకు మేలు: ఏవో

74చూసినవారు
భూసార పరీక్షలతో పంటకు మేలు: ఏవో
భూసార పరీక్షలతో రైతులకు మేలు జరుగుతుందని కొలిమిగుండ్ల మండల వ్యవసాయాధికారి బి. జ్యోతి అన్నారు. శుక్రవారం నందిపాడు, హనుమంతుగుండం, బి. ఉప్పలూరు గ్రామాల్లో ఏవో పర్యటించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం రైతులతో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మట్టి నమూనా సేకరించే పద్ధతులపై ఆయా గ్రామాల్లో వ్యవసాయ సిబ్బందికి, రైతులకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్