ఆళ్లగడ్డ పట్టణంలోని కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో 11వ తేదీన 5 వ వార్షిక ఉచిత రక్తదాన, ఆరోగ్య అవగాహన శిభిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు శ్రీనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం ఎంతో మంది రక్తం దొరకక తనువు చాలిస్తున్నారని ప్రతి ఒక్కరు ఏడాదిలో రెండుసార్లు రక్తదానం చేయాలని సూచించారు. ఆళ్లగడ్డ పట్టణ ప్రజలు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.