బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలోని వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత పాండురంగ విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. కోవెలకుంట్ల పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం ఆలయ సిబ్బంది, నిర్వాహకులు పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిర్వహించారు.