బనగానపల్లె మండలంలోని నందవరం చౌడేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి అనంతపురానికి చెందిన ఒక దాత భారీ విరాళాన్ని మంగళవారం అందించారు. డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్ పీవీ కుమార్ రెడ్డి సమక్షంలో అర్చక, వేదపండితులకు ఆ దాత రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు దాతకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.