బనగానపల్లె మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి అమ్మవారికి ఈనెల 26న చీర, సారె సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 26న ఉదయం 10 గంటలకు గ్రామంలోని చెన్నకేశస్వామి ఆలయం వద్దకు భక్తులు చీర సారె తీసుకుని రావాలని అక్కడి నుంచి గ్రామోత్సవంగా చౌడేశ్వరిదేవి ఆలయం వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకోవాలని తెలిపారు.