కోవెలకుంట్లలో పాండురంగ స్వామి వార్షిక రథోత్సవం గురువారం ఘనంగా నిర్వహించబడింది. భక్తుల నినాదాలతో ఆలయ పరిసరం మార్మోగింది. స్వామివారిని రథంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించగా, సాయంత్రం రథోత్సవం సందడి వాతావరణాన్ని సృష్టించింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందారు.