బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేటకు చెందిన జక్కు సురేష్ సోమవారం తన కూతురు సాయిచంద్రిక, ఆమెతో పాటు ఐదుగురు స్నేహితులను సుమో వాహనంలో గర్ల్స్ హైస్కూల్ నుంచి తీసుకెళ్తుండగా వాహనం ప్రమాదవశాత్తు ఎస్ఆర్బిసి కాలువలో పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తక్షణమే సుమో వాహనంతో పాటు అందరికీ సురక్షితంగా బయటికి తీసి ప్రజల అభినందనలు పొందారు.