బనగానపల్లె విద్యుత్ సబ్ స్టేషన్లలో మరమ్మతు పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని పాతపాడు, పసుపల, బనగానపల్లె సబ్ స్టేషన్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. రైతులకు సరఫరా చేసే ఉచిత విద్యుత్ ఉదయం 4 నుంచి 9 గంటల వరకు, 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు సరఫరా ఉంటుందన్నారు.