బీసీజీ టీకా తీసుకోవడం వల్ల క్షయ వ్యాధి రాకుండా అడ్డుకట్ట వేయవచ్చని రాష్ట్ర టీబీసీ పర్యవేక్షకులు డాక్టర్ శశికాంత్ అన్నారు. గురువారం అవుకులోని గ్రామ సచివాలయం-1 జరుగుతున్న టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడారు. టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. మండలంలో 63 శాతం టీకాలు పంపిణీ పూర్తయిందని, మిగిలిన వారికి త్వరగా టీకాను వేయించాలన్నారు. డాక్టర్లు వినోద్ కుమార్, యమున పాల్గొన్నారు.