కబ్జా నుంచి తమ పొలాన్ని రక్షించాలని నిరసన

63చూసినవారు
కబ్జా నుంచి తమ పొలాన్ని రక్షించాలని నిరసన
బనగానపల్లె మండలం కాపులపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 187/1 లోని 2. 40 ఎకరాల తమ పొలాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేశాడని తమను రక్షించాలంటూ బుధవారం బనగానపల్లెకు చెందిన మహమ్మద్ గౌస్, మైమూన్ కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి, మీడియాకు వారు భూమికి సంబంధించిన పత్రాలను చూయించారు. తమ పొలాన్ని రక్షించాలంటూ అధికారులను వేడుకున్నారు.