నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించబడింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు తెలియజేయగా, ఆయా సమస్యలపై అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రజల సమస్యలపై అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, బాధితులకు న్యాయం కలిగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.