బెలూం గుహలకు అరుదైన గుర్తింపు

51చూసినవారు
బెలూం గుహలకు అరుదైన గుర్తింపు
పురాతన సంస్కృతీ వారసత్వానికి ప్రతీక అయిన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గుహలకు భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు దక్కడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ హర్షం వ్యక్తం చేశారు. భౌగోళిక వారసత్వ ప్రదేశంగా వచ్చిన గుర్తింపుతో మరింత అభివృద్ధికి అవకాశం ఉందని ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వందల ఏళ్లనాటి ఈ గుహలకు పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్