కోవెలకుంట్లలో రౌడీ షీటర్లకు ఎస్ఐ కౌన్సెలింగ్

172చూసినవారు
కోవెలకుంట్లలో రౌడీ షీటర్లకు ఎస్ఐ కౌన్సెలింగ్
కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా తిరిగి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్