కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి ఆహ్వానం మేరకు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో గురువారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రిన్సిపల్ తో కలిసి ఆమె పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆడబిడ్డల పట్ల మర్యాదగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.