ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతు సోదరుల అభివృద్ధికై నాణ్యమైన పైపులను అందించాలని ఉద్దేశంతోనే భారత దేశంలోనే సుప్రీం పైపుల కంపెనీ 1956 లో ఏర్పాటు చేసిందని ఆ కంపెనీ సేల్స్ మేనేజర్ నరసింహ ఆదివారం పేర్కొన్నారు. బనగానపల్లె పట్టణంలోని కంకర గూడెం రెడ్డి డిగ్రీ కళాశాల నందు ఆదివారం పైపుల రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ప్లంబర్ మరియు మోటర్ మెకానిక్ ల మిత్రుల సమావేశం నిర్వహించారు.