బనగానపల్లె పట్టణంలో మంత్రిక్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్థన్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వచ్చిన అర్జీలను మంత్రి స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది.