కోవెలకుంట్ల మండల పరిధిలోని కంపమల్లలో విఘ్నేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి దేవాలయాల భూములకు బుధవారం వేలంపాటలు నిర్వహించారు. 37. 94 ఎకరాలకు వేలంపాట నిర్వహించగా రూ. 3. 54 లక్షల ఆదాయం వచ్చిందని దేవాలయాల ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. ఈ వేలం పాటలలో దేవాలయాల అర్చకులు భాస్కరయ్య, క్రిష్టిపాడు శ్రీనివాసులయ్య, సర్పంచ్ రవిరెడ్డి, గోదుల వెంకటరామిరెడ్డి, సురా చిన్న సుబ్బారెడ్డి పాల్గొన్నారు.