బనగానపల్లె పట్టణ శివారులో ప్రపంచంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం నెలకొంది. వివరాల్లోకి వెళితే యాగంటి పల్లె గ్రామ శివారులో 124 అడుగుల ఎత్తుతో సాయిబాబా విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదని బాబా భక్తులు తెలిపారు. ఈ విగ్రహం తయారీకి 3 కోట్ల రూపాయలు, ఆరు సంవత్సరాల సమయం పట్టిందని తెలిపారు. అమ్ముల సాంబశివరావు సంకల్పంతోనే ఈ ఆలయ మందిరం, విగ్రహం రూపుదిద్దుతుందన్నారు. యాగంటికి వెళ్లే ప్రధాన రహదారిపై విగ్రహం నెలకొంది. ఆలయాన్ని సందర్శించి బాబా ఆశీస్సులు పొందాలని భక్తులు తెలిపారు.