నేడు కొలిమిగుండ్లలో వారపు సంత నిర్వహణకు వేలం పాట

72చూసినవారు
నేడు కొలిమిగుండ్లలో వారపు సంత నిర్వహణకు వేలం పాట
కొలిమిగుండ్ల మండల కేంద్రం కొలిమిగుండ్లలో ప్రతి మంగళవారం జరిగే వారపు సంత నిర్వహణకు సర్పంచ్ శివరాముడు ఆధ్వర్యంలో బుధవారం పది గంటలకు లలితా సుందరేశ్వరస్వామి ఆలయంలో వేలం పాట నిర్వహిస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి భాస్కర్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు ముగియడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహిస్తున్నామని ఆసక్తి వ్యక్తులు రూ. 20 వేలు డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్