బనగానపల్లె పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని నంద్యాల జిల్లా ట్రెజరరీ, అకౌంటెంట్స్ ఆఫీసర్ లక్ష్మీదేవి మంగళవారం కలిశారు. అనంతరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న బీసీ జనార్దన్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు.