వారపు సంత వేలంతో రూ. 4. 80 లక్షల ఆదాయం

77చూసినవారు
కొలిమిగుండ్ల మండల కేంద్రంలొ ప్రతి మంగళవారం నిర్వహించే వారపు సంతకు సంబంధించి బుధవారం వేలం పాటలు నిర్వహించారు. డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు ఆధ్వర్యంలో సర్పంచ్ శివరాముడు అధ్యక్షతన నిర్వహించారు. 9 నెలల కాలపరిమితికి ఈ వేలం పాటలు నిర్వహించారు. వేలం పాట ద్వారా రూ. 4. 80 లక్షల ఆదాయం లభించినట్లు పంచాయతీ కార్యదర్శి భాస్కరరావు పేర్కొన్నారు. పాట పాడిన వారు నిర్ణిత సమయంలో చెల్లించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్