అనారోగ్యంతో వైసీపీ నాయకురాలు మృతి

75చూసినవారు
అనారోగ్యంతో వైసీపీ నాయకురాలు మృతి
అవుకు పట్టణం మార్కెట్ వీధికి చెందిన వైయస్సార్ పార్టీ బీసీ సంక్షేమ నాయకుడు పండ్ల వాయునంద గౌడ్ తల్లి పండ్ల లక్ష్మమ్మ (86) అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, అవుకు మండల వైసీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డితో పాటు వారి స్వగృహానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. వాయునంద గౌడ్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్