భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో నంద్యాల మధు మణి నర్సింగ్ భవనంలో నంద్యాల ప్రాంత వైద్యులకు నిరంతర వైద్య విద్య సదస్సు బుధవారం నిర్వహించారు. కాన్పు తర్వాత ఐరన్ లోపం వలన వచ్చే రక్తహీనత చికిత్సా విధానాలపై స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ అనూష, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించడం ఎలా అన్న అంశంపై డాక్టర్ గీతా వాణి మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా వైద్యులకు వివరించారు.