వాల్మీకి ఉద్యమ ప్రజానేత, ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బోయ పులికొండన్నను రాత్రి సమయంలో అదుపులోకి తీసుకోవడం ఏమిటని, అతన్ని అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బంగి నాగరాజు, రాష్ట్ర యూత్ నాయకుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం ప్యాపిలీ పట్టణంలోని స్థానిక కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో వారు మాట్లాడారు.