బాల్య వివాహ విముక్తి భారత్ ప్రచారంలో భాగంగా డోన్ పట్టణంలోని కోర్టు భవనం నుండి ప్రధాన రహదారి గుండా పాత బస్టాండ్ లోని గాంధీ సర్కిల్ వరకు డోన్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి తంగమణి, జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ రాహుల్ అంబేద్కర్, ఐసిడిఎస్ ఉద్యోగుల సహకారంతో బాల్య వివాహ నిరోధిక చట్టం, ఫోక్సో చట్టం మీద అవగాహన కొవ్వొత్తుల ర్యాలీ బుధవారం నిర్వహించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలన కై ప్రతిజ్ఞ చేయించారు.