బేతంచర్ల: మోకాళ్లపై నిరసన తెలిపిన కార్మికులు

59చూసినవారు
బేతంచర్ల మండలం సిమెంట్ నగర్ లోని పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ తెరిచి, తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో 14 వ రోజు నిరసనలో భాగంగా కార్మికులు ఆదివారం మోకాళ్లపై నిరసన తెలిపారు. పలువురు నాయకులు కార్మికుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. కార్మికుల డిమాండ్ లను పరిష్కరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్